హన్మకొండ కల్చరల్: వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయాన్ని గురువారం సాయంత్రం ముంబైలోని కోర్ట్ ఆఫ్ స్మాల్‌కాజెస్ రిటైర్డ్ చీఫ్ జడ్జి జస్టిస్ శ్రీకాంత్ ఎల్ అనేకర్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అమ్మవారికి ప్రత్యేకపూజలు చేసి న అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
కాశిబుగ్గ: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తైక్వాండో అండర్–14 బాలబాలికల పోటీల్లో వరంగల్ కొత్తవాడలోని భర త్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పాఠశాల నుంచి 20 మంది పాల్గొనగా.. 15 మంది విద్యార్థులు పతకాలు సాధించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు గురువారం ప్రకట నలో తెలిపారు. రెండు బంగారు, రెండు వెండి, 11 కాంస్య పతకాలు పొందారని తెలిపారు.
హెచ్‌ఎంకు మెమో
కాళోజీ సెంటర్: ఖానాపురం మండలం అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.నర్సింహులు పాఠశాల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏఎంఓ మహేశ్ నాయక్, ప్లానింగ్ కోఆర్డినేటర్ విజయ్‌కుమార్‌తో విచారణ చేపట్టారు. ఈ విచారణలో వారు పలు రికార్డులను పరిశీలించి హెచ్‌ఎం నర్సింహులు తన కూతురు అకౌంట్‌లోకి సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు జమచేసినట్లు తేల్చి.. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా డీఈఓ ప్రశాంత్ రెడ్డి గురువారం హెచ్‌ఎం నర్సింహులుకు చార్జెస్ మెమో జారీ చేశారు.
‘లా’ పరీక్షల నిర్వహణ పరిశీలన
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల 5, 6వ సెమిస్టర్ల పరీక్షలు ఐదేళ్ల లా కోర్సు 9, 10 సెమిస్టర్ల అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల సెంటర్‌ను పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆయనవెంట ఆ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహాచారి ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో రెండు సబ్జెక్టుల్లో విద్యాబోధనకు గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపా ల్ రంగయ్యనాయుడు గురువారం ఒక ప్రకట నలో తెలిపారు. కళలు, కళావిద్య (తెలుగు అండ్ ఇంగ్లిష్ మీడియం, వేతనం రూ.15,660) బోధనకు, పెడగాజి ఆఫ్ సైన్స్ ఉర్దూమీడియం(వేతనం రూ.23,400)లో ఒక పోస్టు భర్తీ చే యనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తిచేసి ఈనెల 13నుంచి 16వ తేదీ దరకు సమర్పించాలని కోరారు. మెరిట్ ప్రాతిపదికన 1ః5 నిష్పత్తిలో ఈ నెల 19న డెమో/ఇంటర్వ్యూలు ఉంటాయని, ఎంపికై న వారిని 20న ప్రకటిస్తామని తెలిపారు.
ప్రభుత్వ బీఈడీ కళాశాలలో..
హనుమకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఆరోగ్యం శారీరక విద్య ఒక పోస్టు తాత్కాలిక పద్ధతిన గెస్ట్ లెక్చరర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రంగయ్యనాయుడు తెలిపారు. ఎంపీఈడీ కలిగి ఉన్న అభ్యర్థులు ఈనెల 13నుంచి 16వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
రాష్ట్రస్థాయి ఖోఖో
పోటీలకు ఎంపిక
చెన్నారావుపేట : మండలంలోని ఉప్పరపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని లావణ్య రాష్ట్రస్థాయి అండర్–17 ఖోఖో పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా ఆమెను స్కూల్ ఆవరణలో హెచ్‌ఎం జయ, వ్యాయా మ ఉపాధ్యాయురాలు వీరగోని స్వప్న, ఉపాధ్యాయులు గురువారం అభినందించారు. అనంతరం హెచ్‌ఎం మాట్లాడారు. గత నెల 31న జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో లావణ్య ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనటుల తెలిపారు. పీఈటీ స్వప్న మాట్లాడుతూ మేడ్చల్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పో టీల్లో లావణ్య పాల్గొంటుందని చెప్పారు. రాష్ట్రస్థాయిలో సైతం ప్రతిభ కనబర్చి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.


