కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అల్యూమ్ని అఫైర్స్ డీన్ టి.కిశోర్‌కుమార్ పద్మవిభూషణ్ డాక్టర్ మురళీమనోహర్ జోషి అవార్డ్స్–2026కు ఎంపికయ్యారు. న్యూఢిల్లీకి చెందిన ఫెడరేషన్ ఫర్ వరల్డ్ అకడమిక్స్ (ఎఫ్‌డబ్ల్యూఏ) సంస్థ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి అందించే ఈ అవార్డుకు కిశోర్‌కుమార్‌ను ఎంపిక చేసింది. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఈనెల 22న నిర్వహించే 9వ ఎఫ్‌డబ్ల్యూఏ కాన్క్లేవ్లో ఆయన డాక్టర్ మురళీమనోహర్ జోషి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా నిట్ యాజమాన్యం ప్రొఫెసర్ కిశోర్‌కుమార్‌ను అభినందించింది.


