నెక్కొండ: ప్రముఖుల ఆదర్శ భావాలను విద్యార్థి దశనుంచే అలవర్చుకోవాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను గురువారం ఆమె సందర్శించారు. హాస్టల్‌లోని 24 మంది విద్యార్థినులకు ఇద్దరికి ఒకటి చొప్పున బిగ్ సైజ్ 12 బ్లాంకెట్లు, అలాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్ (బాలుర)లో 20 మంది విద్యార్థులకు 10 బ్లాంకెట్ల ను కలెక్టర్ అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. హాస్టల్‌కు ప్రముఖుల జీవిత చరిత్ర పుస్తకాలను అందించేలా చర్యలు తీసుకోవాలని డీటీడీఓ నారాయణరెడ్డిని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, వార్డెన్లు రవీందర్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
చిత్తడి నేలల సంరక్షణకు చర్యలు చేపట్టాలి
న్యూశాయంపేట: చిత్తడి నేలల సరిహద్దులను క్షేత్రస్థాయిలో గుర్తించి సంరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి నిఖితతో కలిసి చిత్తడి నేలల గుర్తింపు సరిహద్దుల నిర్దారణ నోటిఫికేషన్ ప్రక్రియపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ మెమోకు అనుగుణంగా జిల్లాలోని నేలల సరిహద్దులను భౌతికంగా నిర్ధారించా ల్సిన అవసరం ఉందన్నారు. స్పేస్ అప్లికేషన్ సెంటర్ అట్లాస్ ద్వారా గుర్తించిన చిత్తడి నేలలు నీటి వనరులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి హద్దులను స్పష్టంగా గుర్తించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్, వై.వీ.గణేష్, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భూ రీసర్వే పురోగతిపై సమీక్ష
జిల్లాలో భూభారతి భూ రీసర్వేను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. రీ సర్వే పురోగతిపై గురువారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్పష్టమైన కార్యాచరణతో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
ఖిలా వరంగల్: గురుకుల విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్ ఉర్సుగుట్ట సమీపంలోని మహాత్మాజ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం ఆమె సందర్శించి విద్యార్థినులకు అందిస్తున్న వైద్యసేవలు, పౌష్టికాహారం నాణ్యత, వసతులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండేందు కు పౌష్టికాహారం ఎంతో ఆవసరమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులతో ముచ్చటిస్తూ చలికాలంలో ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల ను వివరించారు. గురుకులంలో ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదుల పెట్టె ద్వారా తనకు తెలియజేయాలని కోరారు. బీసీ సంక్షేమాధికారి పుష్పలతరెడ్డి, ప్రిన్సిపాల్ అంజిరెడ్డి, విద్యార్థినులు పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ఖిలా వరంగల్: విద్యార్థులకు మెరుగైన విద్యా మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో చేపడుతున్న యంగ్ ఇండియా స్కూల్ భవన నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ మండలం కొత్తపేటలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కూల్ భవన పనులను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు నాణ్య త విషయంలో రాజీపడకుండా గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈఓ ప్రశాంత్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత రెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ ఈఈ అరుణ్‌కుమార్, డీఈ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యశారద


