● జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
కిష్టయ్య
● రేషన్ దుకాణాల్లో తనిఖీలు
ఖిలా వరంగల్/వరంగల్ చౌరస్తా: బియ్యం విక్రయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిష్టయ్య సూచించారు. వరంగల్ బీట్ బజార్‌లోని రిటైల్ బియ్యం దుకాణాలపై జిల్లా పౌరసరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ కిష్టయ్య మాట్లాడుతూ రిటైల్, హోల్‌సేల్ బియ్యం దుకాణాల ఎదుట ధరల వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులపై కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్, డీటీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


