నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా కంచర్ల నరేశ్‌రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్‌గుప్తా నూతన కమిషనర్‌కు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ నూతన కమిషనర్ కంచర్ల నరేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణ అభివృద్ధి మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించడంతోపాటు పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. కౌన్సిలర్లు పున్నం నర్సింహారెడ్డి, సలావుద్దీన్ అయూబ్‌ఖాన్, మాదాసి రవి, బీరం భరత్‌రెడ్డి, కొత్తకొండ మేఘన శ్యాంరాజ్ పాల్గొన్నారు.


