కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో సిజేరియన్లు తగ్గించాలని జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రాజారెడ్డి ఆదేశించారు. బుధవారం వారు సీకేఎం ఆస్పత్రిని సందర్శించి వైద్య సేవల మెరుగుదలపై సమీక్షించారు. ఆస్పత్రి ఆర్‌ఎంఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ అవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియన్ చేయాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. హెపటైటిస్–బీ పాజిటివ్ తల్లులకు, పుట్టిన శిశువులకు 24 గంటల్లోపు వ్యాక్సిన్‌తో పాటు హెపటైటిస్ –బీ ఇమ్యునోగ్లోబులిన్ (హెచ్‌బీఐజీ) తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం సీకేఎం పరిధిలోని యూఎఫ్‌డబ్ల్యూసీలో టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఓపెన్ వైల్ పాలసీ సక్రమంగా అమలు చేయాలని, కోల్ట్‌చైన్‌ను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
కాశిబుగ్గ: వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్‌లో స్టెమీ కార్యక్రమంతోపాటు పాలియేటివ్ కేర్ సేవల నమోదుపై చర్చించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజారెడ్డి, ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్‌కుమార్‌రెడ్డి, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు ఈ కార్యక్రమాల సమన్వయంపై సమీక్షించారు.
కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరంలో ఎంబీఏ బోధించేందుకు అతిథి అధ్యాపకులు కావాలని ప్రిన్సిపాల్ డాక్టర్ పోచయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏలో 55 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) మార్కులతో ఉత్తీర్ణత కలిగిన ఉండాలని, పీహెచ్‌డీ/నెట్/సెట్ కలిగిన వారికి ప్రాధాన్యత, బోధన అనుభవానికి వెయిటేజీ ఇస్తామని పేర్కొన్నారు. అసక్తిగల వారు బయోడేటాతోపాటు జిరాక్స్ సర్టిఫికెట్లను కళాశాల కార్యాలయంలో ఈ నెల 7వరకు అందజేయాలని కోరారు.
మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్‌నాయక్ గురువారం సందర్శించనున్నారు. ఈసందర్భంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ పర్యవేక్షణలో జరుగుతున్న పనులు ఆయన పరిశీలించనున్నారు. డిసెంబర్ మొదటివారంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించి, పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ ఎయిర్‌పోర్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను సిద్ధం చేసి అందించనున్నట్లు తెలిసింది. అదేవిధంగా జరుగుతున్న పనులు మరింత వేగవంతంగా చేపట్టాలని ఆదేశించి, పురోగతిపై అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. ఆయన వెంట ఎయిర్‌పోర్ట్ అఽథారిటీ అధికారులతో పాటు, జిల్లా యంత్రాంగం, బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు రానున్నట్లు తెలిసింది.


