● రాష్ట్రస్థాయికి 8 ప్రాజెక్టుల ఎంపిక
కాళోజీ సెంటర్: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 32వ జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వరంగల్ నగరంలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకయ్య హాజరై మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిఽశోధనా నైపుణ్యం పెంపొందించాలన్నారు. స్థానిక సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారం ఈ ప్రాజెక్టుల్లో కనిపించడం అభినందనీయమన్నారు. విశిష్ట అతిథి, జిల్లా కమ్యూనిటి మొబిలైజింగ్ అధికారి, సైన్స్ కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్, మండల విద్యాశాఖాధికారి వెంకటయ్య పాల్గొన్నారు. సైన్స్ కాంగ్రెస్‌కు జిల్లా వ్యాప్తంగా మొత్తం 190 ప్రాజెక్టులు వచ్చాయి. విద్యార్థులు తమ పరిశోధనా ప్రాజెక్టులను చార్టులు, సర్వే ఆధారిత లాగ్‌బుక్, ప్రాజెక్టు నివేదికతో ప్రదర్శించారు. 10 మంది న్యాయ నిర్ణేతల బృందం 8 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసింది. మరో నాలుగు ప్రాజెక్టులకు కన్సోలేషన్ బహుమతులు ప్రదానం చేశారు.


