హన్మకొండ : ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని ఆల్ తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూపురాణి సీతారాం మండిపడ్డారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో ఆల్ తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వరంగల్, హనుమకొండ జిల్లా సమావేశాలు రెండ్రోజుల పాటు జరిగాయి. మంగళవారం నిర్వహించిన సమావేశంలో సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు నెలల్లో పీఆర్‌సీ ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదని, డీఏలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించాలని, బకాయి డీఏలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తిరువరంగల్ నందకిశోర్, సుధీర్ కంచర్ల, నాయకులు కట్టా నాగభూషణచారి, మల్లారెడ్డి, గడ్డం స్వామి, ప్రభాకర్ రెడ్డి, ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, దేవరకొండ నరేందర్, మురహరి శెట్టి చంద్రశేఖర్, రెబెల్లి వెంకటేశ్వరస్వామి, బోయినిపల్లి సోమేశ్వర్ రావు, పి.చక్రధర స్వామి, డి.రామచంద్రాచార్యులు, శ్రీరంగాచార్యులు, కె.సాయన్న, కె.సదానందం. తాడూరి సుధాకర్, వేణుగోపాలచారి, కొదిరిపాక సాంబమూర్తి, రాజనాల కుసుమ కుమారి, మందల వసుమతి, మందల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారాం


