దుగ్గొండి: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని మల్లంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దుగ్గొండి, నాచినపల్లి, మల్లంపల్లి స్కూల్ కాంప్లెక్స్‌ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై దృష్టి సారించాలన్నారు. ఉత్తమ క్రమశిక్షణ, మంచి విద్యను అందించి తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాలన్నారు. అనంతరం మల్లంపల్లి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన రుచికరమైన భోజనం అందించాలని ఏజెన్సీ మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు, హెచ్ఎంలు రామస్వామి, భార్గవి, జ్యోతిలక్ష్మీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ ప్రశాంత్‌రెడ్డి


