వర్ధన్నపేట: ఎల్‌నినో నేపథ్యంలో వర్షాలు లేకపోవడంతో జూన్ వరకు ఆయిల్‌పామ్ రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండలంలోని ఇల్లందలో జరిగిన రైతుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆయిల్‌పామ్ మొక్కలను కాపాడుకోవడానికి జూన్ వరకు స్ప్రింక్లర్లు, మల్చింగ్, పశువుల ఎరువుల ద్వారా నిరంతర తేమ అందించాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని వరికి బదులు కందులు, పెసలు, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి విజయ్‌కుమార్, నూతన ఆయిల్‌పామ్ కమిటీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, ఉద్యానవన అధికారి వేణుమాధవ్, మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


