రాయపర్తి: దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సన్నూరు వేంకటేశ్వరపల్లి దేవాలయాన్ని కలెక్టర్ సత్యశారదతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. రూ.10కోట్లతో అంచనా వ్యయంతో అభివృద్ధి పనులను చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సునీత, జెడ్పీ సీఈఓ వసంత, డీఆర్డీఓ నాగపద్మజ, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ పాక శ్రీనివాసులు, సర్పంచ్ సంకినేని సారయ్య, ఉపసర్పంచ్ మంద రాజు, అధికారులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి


