ఇన్‌సర్వీస్‌ టీచర్లకు మాక్‌ టెస్ట్‌లు | - | Sakshi
Sakshi News home page

ఇన్‌సర్వీస్‌ టీచర్లకు మాక్‌ టెస్ట్‌లు

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

కాళోజీ సెంటర్‌: టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)కు సిద్ధమవుతున్న ఇన్‌సర్వీస్‌ టీచర్లకు ఆన్‌లైన్‌ పరీక్ష విధానంపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో మాక్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షను ఈనెల 5, 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు జి ల్లా విద్యాశాఖాధికారి ప్రశాంత్‌రెడ్డి మంగళవారం ఒ క ప్రకటనలో వెల్లడించారు. నర్సంపేటలోని బిట్స్‌, ఉర్సుగుట్టలోని బిర్లా ఓపెన్‌ మైండ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో నిర్వహించే మాక్‌ టెస్ట్‌లకు మొత్తం 217 మంది ఉపాధ్యాయులు హాజరుకానున్నారు.

మండలాల వారీగా..

నర్సంపేట బిట్స్‌ కేంద్రంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చెన్నారావుపేట మండలానికి చెందిన 15 మంది, ఖానాపురం మండలానికి చెందిన 12 మంది ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నెక్కొండ మండలానికి చెందిన 9 మంది, నర్సంపేట మండలానికి చెందిన 21 మంది ఉపాధ్యాయులకు పరీక్ష ఉంటుంది. అలాగే ఉర్సుగుట్టలోని బిర్లా ఓపెన్‌ మైండ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఉదయం సెషన్‌లో ఖిలా వరంగల్‌ మండలానికి చెందిన 24 మంది, నల్లబెల్లి మండలానికి చెందిన 16 మంది ఉపాధ్యాయులకు, మధ్యాహ్నం సెషన్‌లో దుగ్గొండి మండలానికి చెందిన 15 మంది, గీసుగొండ మండలానికి చెందిన 17 మంది, స ంగెం మండలానికి చెందిన 9 మంది ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అ లాగే 6వ తేదీన ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వరంగల్‌ మండలానికి చెంది న 33 మంది, పర్వతగిరి మండలానికి చెంది న 1 8 మంది, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గ ంటల వరకు రాయపర్తి మండలానికి చెందిన 14 మ ంది, వర్ధన్నపేట మండలానికి చెందిన 14 మంది ఉపాధ్యాయులకు మాక్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షా విధానంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం, పరీక్షా సరళిని ముందుగానే తెలుసుకునే అవకాశం కల్పించడం, సమయపాలనతో పరీక్ష రాసేలా సన్నద్ధం చేయడం ఈ మాక్‌ టెస్ట్‌ ముఖ్య ఉద్దేశమని డీఈఓ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కేటాయించిన తేదీ, సమయం, పరీక్షా కేంద్రానికి అనుగుణంగా ఉపాధ్యాయులు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రేపటి నుంచి ఆన్‌లైన్‌లో పరీక్ష

జిల్లాలో 217 మంది ఉపాధ్యాయులకు కేటాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement