కాళోజీ సెంటర్: తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ వ్యాఖ్యాత, గాయకుడు ఠంయ్యాల శ్రీధరాచార్యులను జిల్లా విద్యాశాఖ అధికారులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఎల్బీనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన సమ్మిళిత విద్యపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో వ్యాఖ్యాత, గాయకుడిగా సేవలందించారు. దీంతో ఆయనను విద్యాశాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీఎంఓ డాక్టర్ కె. శ్రీనివాస్, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ బరుపాటి గోపి, డీసీఈబీ కార్యదర్శి, ఏసీజీఈ, ఏఎంఓ, ప్లానింగ్ కోఆర్డినేటర్, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నర్సంపేట మున్సిపల్
కమిషనర్‌గా నరేష్‌రెడ్డి
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్‌గా కె.నరేష్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె.శ్రీదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మరిపెడ మున్సిపాలిటీలో మేనేజర్‌గా పని చేస్తూ ఓడి ప్రాతిపదికన మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న కె.నరేష్‌రెడ్డిని నర్సంపేట మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ నియామకానికి సంబంధించి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లేఖ మేరకు, పరిపాలన అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
మొసలి పిల్ల ప్రత్యక్షం
చెన్నారావుపేట: మండలపరిధిలోని పాపయ్యపేట శివారం ధర్మాతండాలో మొసలి ప్రత్యక్షమైంది. తండావాసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు చిన్న అనే రైతు వ్యవసాయ అవసరాల కోసం చిన్న నీటి కుంటను ఏర్పాటు చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఆ నీటికుంటలో మొసలి ప్రత్యక్షమైంది. గమనించిన సర్పంచ్ బోడ రవి అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారి నవీన్ ఆధ్వర్యంలో మొసలిని పట్టుకుని పాకాల చెరువులో వదిలిపెట్టారు.
6న జాబ్‌మేళా
కాళోజీ సెంటర్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి. సాత్విక మంగళవారం ఒక ప్రకట నలో తెలిపారు. పేటీఎం కంపెనీలో ఖాళీగా ఉన్న 30 ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు పురుషులు అర్హులన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. వరంగల్, కాజీపేట, హనుమకొండ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.
ఐఎంఏ నూతన
కార్యవర్గం ఎన్నిక
కాశిబుగ్గ: వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఐఎంఏ ఎన్నికలకు గాను నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికై న వారిని రిటర్నింగ్ అధికారి డాక్టర్ నాగార్జునరెడ్డి, కో రిటర్నింగ్ ఆఫీసర్లు డాక్టర్ బందెల మోహన్‌రావు, డాక్టర్ కె.మల్లేశంలు ప్రకటించారు. అధ్యక్షుడిగా డాక్టర్ టి.సనత్‌కుమార్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ బి.నరేష్, డాక్టర్ జి.రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎన్.మానస, డాక్టర్ తెలుగు రామకృష్ణ, జనరల్ సెక్రటరీగా డాక్టర్ వి.నరేష్‌కుమార్, జాయింట్ సెక్రటరీలుగా డాక్టర్ జె.కా వ్యరావు, డాక్టర్ బి.సంతోష్‌కుమార్, డాక్టర్ ఎస్.సృజన, డాక్టర్ బి.పూర్ణచందర్. ఫైనాన్స్ సెక్రటరీగా డాక్టర్ ఎం.దిలీప్‌కుమార్ ఎన్నికై నట్లు వారు పేర్కొన్నారు. అలాగే స్టేట్ కౌన్సిల్ మెంబర్లుగా 23 మంది వైద్యులు ఎన్నికై నట్లు వివరించారు. వీరు 2026–2027 సంవత్సరాని కి ఆయా పదవుల్లో కొనసాగుతారన్నారు.


