ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలు కావొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలు కావొద్దు

Nov 4 2026 2:26 AM | Updated on Nov 4 2026 2:26 AM

ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలు కావొద్దు

● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

పరకాల : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు కావాల్సిన అన్ని వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్నాయని.. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి అప్పుల పాలు కావొద్దని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కోరారు. పరకాలలోని నూతన ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు సౌకర్యాలను ఆ యన పరిశీలించారు. అనంతరం రోగులతో మా ట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ప్రతీ ఒక్కరికి నాణ్యమైన వైద్యం, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కలిగేందుకు ఎంత ఖర్చు అయినా వెనకడుగు వేయడం లేదన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో అలసత్వం వహించకుండా బాధ్యతయుతంగా వైద్యసేవలను అందించాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పావుశెట్టి సునీల్‌కుమార్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వంశీ, ఆర్‌ఎంఓ బాలకృష్ణ, వైద్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement