పర్వతగిరి: చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ నిర్మల గీతాంబ అన్నారు. ఈ మేరకు మండలకేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్‌లో శనివారం సురక్షిత్ బచ్పన్ అభియాన్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భద్రత, బాలల హక్కుల పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతన్నారు. పిల్లలు ఎలాంటి వేధింపులకు గురికాకుండా సురక్షిత వాతావరణంలో విద్యను అభ్యసించేలా బాధ్యత తీసుకోవాలన్నారు. పిల్ల లకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలియజేయాలన్నారు. అనంతరం హక్కులు, రక్షణ అంశాలతో ముద్రించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కందుకూరి పూజ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్, షీ టీం ఇన్‌స్పెక్టర్ రామారావు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ సురేష్, శ్రీనివాసరావు, రజిని తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నిర్మల గీతాంబ


