జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపిక

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

సంగెం: జాతీయస్థాయి ఎన్‌జీఎఫ్‌ఐ రెజ్లింగ్‌ పోటీలకు మండలంలోని మొండ్రాయి జెడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని తూర్పాటి నవ్యశ్రీ ఎంపికై నట్లు హెచ్‌ఎం విజయ, పీడీ ముఖర్జీలు శనివారం తెలిపారు. అక్టోబర్‌ 15 నుంచి 17వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొని గోల్డ్‌మెడల్‌ సాధించింది. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న 70వ ఎస్‌జీఎఫ్‌ 17 సంవత్సరాల బాలబాలికల జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొననుందన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న నవ్యశ్రీని సర్పంచ్‌ గూడ స్వరూప, ఉప సర్పంచ్‌ గూడ విజయ్‌కుమార్‌, అమ్మ ఆదర్శ కమిటీ చైర్‌పర్సన్‌ అనుముల శ్రీ లత, ఉపాధ్యాయబృందం అభినందించారు.

విద్యార్థి అమరుల సభను విజయవంతం చేయాలి

నర్సంపేట: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు జరిగే విద్యార్థి అమరవీరుల వర్థంతి సభలను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కె.రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసీ్త్రయ విద్యా సాధన, సమ సమాజ లక్ష్యంతో ఎంతో మంది విద్యార్థులు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలను నిర్మించారన్నారు. అమరులను స్మరిస్తూ నవంబర్‌ 5 నుంచి 11వ తేదీ వరకు విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభలను ప్రతీ విద్యాలయాల్లో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు స్వప్న, సౌజన్య, రాధిక, మమత, రాజేష్‌, నవీన్‌, ప్రశాంత్‌, నితిన్‌, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

నేడు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

కాళోజీ సెంటర్‌: జాతీయ ఉపకార వేతన పథకం (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష నేడు (ఆదివారం) జిల్లాలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌. ప్రశాంత్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుందన్నారు. జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, వరంగల్‌ డివిజన్‌లో నరేంద్రనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 269 మంది, రంగశాయిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 266, నర్సంపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 203, మొత్తం 738 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ తెలిపారు.

ఆయుష్‌ పోస్టులకు 494 దరఖాస్తులు

గీసుకొండ/కాశిబుగ్గ: జాతీయ ఆయుష్‌లో ఔ ట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించనున్న 12 రకాల పోస్టులకు 494 దరఖాస్తులు వచ్చిన ట్లు ఆయుష్‌ జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ మైదం రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఒక పీజీ డాక్టర్‌, 4 ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్లు, డైటిషియన్‌, సైకో సోషల్‌ కౌన్సిలర్‌, యోగా ప్రొఫెషనల్‌, 4 మల్టీపర్సర్‌ హెల్త్‌ వర్కర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. కలెక్టర్‌ సత్యశారద, ఆయుష్‌ సంచాలకులు డాక్టర్‌ ప్రమీలదేవి పర్యవేక్షణలో అభ్యర్థుల ఎంపికను పారదర్శంగా నిర్వహిస్తామన్నారు. దరఖాస్తుల స్క్రూటినీ ప్రక్రియను మెడికల్‌ ఆఫీసర్‌ రాజేందర్‌, ఫార్మసిస్టు ఓదెలు, సిబ్బంది శ్యాం, రాజమణి, శ్రీ లక్ష్మీ, నర్సయ్యలు సజావుగా చేపట్టినట్లు వివరించారు.

ఇంటిపై పిడుగుపాటు

● కాలిపోయిన గృహోపకరణాలు

నెక్కొండ: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా ఓ ఇంటిపై పిడుగు పడిన సంఘటన మండలకేంద్రంలోని శనివారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి బొడ్రాయి సమీపంలో వడ్డె విజేందర్‌ ఇంటిపై పిడుగుపడడంతో గోడ కూలి పెచ్చులు ఊడిపడ్డాయి. ఇల్లు పాక్షికంగా దెబ్బతినడంతోపాటు సమీప ఇళ్లలోని ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు, సీసీ కెమెరాలు, ఇతర గృహోపకరణాలు కాలిపోయాయి. అలాగే డిష్‌ పరికరాలు, సెటాప్‌ బాక్సులు, అడాప్టర్లు కాలిపోవడంతో నష్టం వాటిల్లిందని డిష్‌ నిర్వాహకులు తెలిపారు. మొత్తంగా సుమారు రూ.2.75 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు పేర్కొన్నారు. దెబ్బతిన్న ఇంటిని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొణిజేటి భిక్షపతి, కదురు సాంబయ్య, బొమ్మెరబోయిన రమేశ్‌, ఈదునూరి ప్రభాకర్‌, మూసిన సారయ్య, నేతుల సారంగపాణి, తాళ్లపెల్లి భాస్కర్‌, పోరండ్ల శ్రీనివాస్‌లు పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందేలా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement