దేశ ఐక్యతకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

దేశ ఐక్యతకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

న్యూశాయంపేట: దేశ ఐక్యత, సమగ్రత భద్రత పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని కలెక్టరేట్‌ సమావేశహాల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్‌ చిత్రపటానికి కలెక్టర్‌ సత్యశారద పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమైక్యతా, సమగ్రత, భద్రతను కాపాడేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు కిషోర్‌కుమార్‌, వై.వి.గణేశ్‌, ఏఓ శ్రవణ్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అటవీ హక్కుల గుర్తింపు చట్టంపై సమీక్ష

జిల్లాలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) అమలుకు సంబంధించి చేపడుతున్న చర్యలపై కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కమిటీ సమావేశంలో పాల్గొని చట్టానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. రైతులు బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌ అనుమతులకు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించారు. నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డీఎఫ్‌ఓ బి.నిఖిత, ఐటీడీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ లెనిల్‌ వత్సల్‌ టొప్పో, అదనపు కలెక్టర్‌ ఎల్‌.కిషోర్‌కుమార్‌, న ర్సంపేట ఆర్‌డీఓ ఉమారాణి, జిల్లా ట్రైబల్‌ వెల్ఫే ర్‌ అధికారి నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

సీకేఎం కళాశాల సందర్శన

కాశిబుగ్గ: వరంగల్‌ దేశాయిపేటలోని సీకేఎం కళాశాలను కలెక్టర్‌ సత్యశారద సందర్శించారు. శనివారం ఉదయం నేరుగా కాలేజీలోని హాస్టల్‌కు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులతో సమావేశమై కళాశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని సూచించారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement