ఖిలావరంగల్: జిల్లావ్యాప్తంగా వరి కోతలు ము మ్మరం కావడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ని ర్వహణలో అధికారులు పారదర్శకత పాటిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి వసతుల కల్పనపై నిబంధనలు కఠినతరం చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయనే అంశాలను కేంద్రం తెచ్చిన యాప్‌లో ఏఐ ఆధారిత అంశాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
అధికారుల పర్యవేక్షణ
రైతులు తెచ్చే ధాన్యం నిఘానేత్రం పర్యవేక్షణలో ఉండనున్నాయి. రాత్రి వేళ సౌర దీపాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా దిగుబడికి తగ్గట్టుగా అదనపు కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు ఈసారి కలగకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో 201 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో 2026–27 వానాకాలం సీజన్‌లో 201 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ధాన్యం దిగుబడి శాతం తగ్గనుండటంతో దీనికి తగ్గట్టుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్, ఐకేపీ, ఓడీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో ప్రతీ కేంద్రానికి 40కి పైగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచనున్నారు.
నిర్వాహకులపై అదనపు భారం
అమలు చేయనున్న నిబంధనలతో నిర్వాహకులపై అదనపు భారం పడనుంది. ఈసారి అదనంగా సీసీ కెమెరాలతో పాటు సౌర విద్యుత్, తదితర ఏర్పాట్లు చేస్తేనే కొనుగోలు కేంద్రానికి అనుమతి లభించను ంది. దీంతో నిర్వాహకులపై అదనపు భారం పడనుంది.
16 ప్రశ్నలు ఏమిటంటే..
యాప్‌లో మొత్తం 16 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే నే కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఫ్లెక్సీ, తాగునీరు, టెంట్, భూమిచదును, ఎలక్ట్రికల్ యంత్రం, విద్యుత్ సౌకర్యం, లోడింగ్, అన్‌లో డింగ్ ప్రాంతాల్లో వసతులు, ధాన్యం కొనుగోలు చే సిన తక్షణమే ఆన్‌లైన్‌లో నమోదు, మరుగుదొడ్డి, ట్యాబ్ ఎంట్రి, వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం, కొనుగోలు కేంద్రం ఎన్ని రోజులు నిర్వహిస్తారు? టార్పాలిన్లు, గన్నీ బస్తాలు, నిల్వ స్థలాలు, కేంద్రం వద్ద రక్షణ గేటు, ధాన్యం రక్షణకు జాగ్రత్తలు, తే మ శాతం యంత్రం, తూర్పార య ంత్రం, సీసీ కెమెరాల ఏ ర్పాటు తదితర సౌకర్యాల ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేస్తే నే అనుమతి లభిస్తుంది.
రాయపర్తిలోని
కొనుగోలు కేంద్రం
ఏడు రకాల సన్నాలకు బోనస్
వానాకాలంలో సన్న రకాల వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహించింది. ప్రభుత్వం సూ చించిన సన్నాలకు క్వింటాల్‌కు రూ.500లు బోనస్ చెల్లించనుంది. సాగు చేసిన ఏడు రకాల్లో బీపీటీ–5204 (సాంబమాసూరి), ఆర్‌ఎన్‌ఆర్–15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం సెగ్మెంట్, కేఎన్‌ఎం–1638, డబ్ల్యూజీఎల్–44, కేఎన్‌ఎం–7715 రకాలు ఉన్నాయి.
ఏఐ ఆధారిత అంశాలు నమోదు తప్పనిసరి
యాప్‌లో 16 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే కేంద్రం ఏర్పాటు
నిబంధనలు కఠినతరం
చేసిన కేంద్రం
జిల్లాలో 201 ధాన్యం కొనుగోలు
కేంద్రాలు
మద్దతు ధర (క్వింటాల్‌కు)
గ్రేడ్ ఏ రకానికి రూ.2,461
సాధారణ రకానికి రూ. 2,441
సన్నాలకు బోనస్ రూ.500
అన్ని రకాల సౌకర్యాలు ఉండాల్సిందే..
ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉండాల్సిందే. 16 ప్రశ్నలకు సమాధానం యాప్‌లో నమోదు చేస్తేనే కొనుగోలు కేంద్రం నిర్వహణకు అనుమతి లభిస్తుంది. లేదంటే అనుమతి రాదు.
– సంధ్యారాణి, మేనేజర్
జిల్లా పౌరసరఫరాల శాఖ


