ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

Oct 30 2026 7:24 AM | Updated on Oct 30 2026 7:24 AM

● బ్లాక్‌ స్పాట్స్‌పై యాక్షన్‌ప్లాన్‌

రూపొందించాలి

● రోడ్‌సేఫ్టీ కమిటీ సమావేశంలో

కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్‌సేఫ్టీ కమిటీ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 బ్లాక్‌స్పాట్స్‌ గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు గల కారణాలు క్షేత్రస్థాయిలో విశ్లేషించి, నివారణకు సమగ్ర యాక్షన్‌ప్లాన్‌ రూపొందించి నివేదికలు సమర్పించాలని అధికారులకు సూచించారు. నర్సంపేట ప్రాంతంలో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు విశ్లేషించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు ఎల్‌.కిశోర్‌కుమార్‌, వైవీ గణేశ్‌, ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, ఎన్‌హెచ్‌ పీడీ భరద్వాజ్‌, అధికారులు పాల్గొన్నారు.

నరకాసుర వధకు పకడ్బందీ ఏర్పాట్లు

నరకాసుర వధ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. నవంబర్‌ 6న వరంగల్‌ ఉర్సు రంగలీలా మైదానంలో నిర్వహించనున్న నరకాసుర వధ కార్యక్రమ నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, అదనపు కలెక్టర్‌(లోకల్‌బాడీస్‌) వైవీ గణేశ్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్‌ ఆర్డీఓ సుమ, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్‌, డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, నరకాసుర వధ ఉత్సవ కమిటీ సభ్యుడు ఎం.రవి తదితరులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల ముప్పు నుంచి కాపాడాలి

యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుంచి కాపాడేందుకు పాఠశాల నుంచే విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. కలెక్టరేట్‌లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement