కల్వర్టును ఢీకొని కారు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

కల్వర్టును ఢీకొని కారు దగ్ధం

Oct 28 2026 5:48 AM | Updated on Oct 28 2026 5:48 AM

కల్వర్టును ఢీకొని కారు దగ్ధం

భీమదేవరపల్లి: అడవిపందిని తప్పించబోయిన ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్‌–మంగళపల్లి మార్గంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో హనుమకొండ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో గట్ల నర్సింగాపూర్‌–మంగళపల్లి శివారులోకి రాగానే, రోడ్డుపై అకస్మాత్తుగా అడ్డువచ్చిన అడవి పందిని తప్పించబోయారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వారు కారులోంచి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

● అడవి పందిని తప్పించబోయి ప్రమాదం

● గట్లనర్సింగాపూర్‌– మంగళపల్లి మార్గంలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement