● సీఎస్ సంజయ్ జాజు
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, లక్ష్యాల సాధనపై సమీక్షించారు. విద్య, ఉపాధి హామీ, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ బి. శేషాద్రి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య, విద్యుత్, గృహ నిర్మాణ శాఖల అధికారులు పాల్గొన్నారు.


