● బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి
హన్మకొండ: పట్టభద్రులను, నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెబుదామని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతంరావు పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచక శక్తులను తరిమికొడతాం’ నినాదంతో బీజేపీ త్వరలో మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పాల్గొన్నారు.


