వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

– 8లోu – వివరాలు 8లోu

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

ఓటరు జాబితాపై జల్లెడ

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వేగం పుంజుకుంది.

సాక్షి, వరంగల్‌: జిల్లాలోని ఎస్టీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ వసతి హాస్టల్స్‌ విద్యార్థులకు నిత్యావసర సరుకుల సరఫరా సక్రమంగా జరగక ఆహారం తినేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల ఒకటి నుంచే కొత్త కాంట్రాక్టర్‌ సరుకులు సరఫరా చేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ చేతులెత్తేయడంతో కొన్ని గురుకులాల్లో వార్డెన్లు అప్పులు చేసి సరుకులు కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరో వైపు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాత కాంట్రాక్టర్‌ అందిస్తున్న సరుకులు ఆలస్యంగా చేరడంతో సమస్య తీవ్రంగా మారింది. నెలాఖరు కావడంతో ఇప్పుడు కాస్త సద్దుమణిగినా.. వచ్చే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇటు అధికారులు, అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 22 హాస్టల్స్‌లో 10,605 మంది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఇంతమంది విద్యార్థులకు ప్రతిరోజూ భోజనం, అల్పాహారం అందించేందుకు సరుకులు నిరంతరం అవసరముండడంతో కొత్త కాంట్రాక్టర్‌ సరఫరాను వెంటనే ప్రారంభించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతోంది.

నర్సంపేటలోని బాలుర హాస్టల్‌

మచ్చుకు కొన్ని ఇలా..

● వర్ధన్నపేట గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 208 మంది విద్యార్థులున్నారు.అయితే సెప్టెంబర్‌ నెల వంట సామగ్రి సంబంధిత కాంట్రాక్టర్‌ సకాలంలో అందించకపోవడంతో ఇన్‌చార్జ్‌ వార్డెన్‌ సుజాత స్థానిక కిరాణాషాపుల్లో కొనుగోలు చేసి విద్యార్థులకు ఇబ్బంది లే కుండా చేసింది. రూ.70 వేల నుంచి రూ. 80 వేల వరకు స్థానిక కిరాణా షాపుల్లో కొనుగోలు చేసుకుని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజ నం, బ్రేక్‌ ఫాస్ట్‌ అందిస్తున్నామన్నారు. రెండు రోజుల క్రితం పాత కాంట్రాక్టు సంస్థ వంట సామగ్రి అందించారు. దీంతో అక్టోబర్‌ నెల వరకు వంట సామగ్రి సరిపోయే అవకాశం ఉందన్నారు. దసరా సెలవుల తర్వాత మళ్లీ ఇబ్బంది ఏర్పడే అవకాశముందని వాపోయారు.

● సంగెం మండలకేంద్రంలో ఎస్టీ బాలుర హాస్టల్‌లో 40 మంది విద్యార్థులున్నారు. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి ఇటీవలే ఇడ్లీ, ఉప్మా రవ్వ, మినప పప్పు, ఆయిల్‌, ఉప్పు, కారం, పసుపు, సాంబార్‌ పౌడర్‌, ధనియాల పొడి, చక్కెర మాత్రమే వచ్చినవి. మిగిలిన సరుకులు రాకపోవడంతో వార్డెన్‌ రాజు కూరగాయల కోసం రూ.10,000, కిరాణా సామగ్రి కోసం రూ.12,000 అప్పు చేసి మెనూ ప్రకారం వడ్డిస్తున్నారు. అక్టోబర్‌కు సంబంధించి ఎలాంటి సరుకుల నిల్వలు చేయలేదు.

● నర్సంపేటలోని ప్రభుత్వ గిరిజన బాలుర వస తి గృహంలో 175 మంది విద్యార్థులు ఉన్నా రు. సెప్టెంబర్‌ నెలకి సంబంధించి బియ్యంతో పాటు పూర్తిగా సరుకులు వచ్చాయి. కూరగా యలు టెండర్‌ సప్లై లేదు. ఆగస్టు నెలలోనే టెండర్‌ పూర్తైపోయింది. మాంసంకు టెండర్‌ ఉన్న సదరు కాంట్రాక్టర్‌ సరఫరా చేయకపోవడంతో హాస్టల్‌ వార్డెన్‌నే కొనుగోలు చేసి మెనూ ప్రకారం అందిస్తున్నారు. నిత్యావసరాలు, చికె న్‌, మటన్‌లను ప్రైవేట్‌ వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి ఆ బిల్లును ప్రభుత్వానికి నివేదించడంతో వెండర్‌ అకౌంట్లోనే నేరుగా డబ్బులు జమవుతున్నాయి. మెనూలో మార్పు లే కుండానే యథావిధిగా కొనసాగిస్తున్నారు.

టెర్మినల్‌ సహా కీలక నిర్మాణాలు

హాస్టళ్లు, విద్యార్థుల వివరాలు

డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ

ఎస్‌ఎంఎస్‌లు

కాకతీయ వర్సిటీ ఎస్‌డీఎల్‌సీఈ పరీక్షల నిర్వహణపై ప్రశ్నలు

అధికారులకు ఫిర్యాదు చేయడంతో లోపాలు వెలుగులోకి..

అధికారుల సమన్వయ లోపం

విద్యార్థులకు శాపం

కొన్నిచోట్ల వార్డెన్లే అప్పులు చేసి

సరుకులు కొనుగోలు

పాత కాంట్రాక్టర్‌ సరఫరాతో

తాత్కాలిక ఉపశమనం

దసరా తర్వాత ‘కొత్త’ కష్టాలు

తప్పవనే ఆందోళన

అధికారులు దృష్టి సారిస్తేనే

విద్యార్థులకు భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement