సీఈసీ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఈసీ రాజీనామా చేయాలి

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

కాశిబుగ్గ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ పోచమ్మమైదాన్‌ సెంటర్‌లో ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మానవహారం, నిరసన, సీఈసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ఎన్నికల వ్యవస్థలను రాజకీయంగా వాడుకుంటుందన్నారు. బీజేపీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కే చర్యలు పాల్పడితే కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అనంతరం ఈసీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు ఓర్సు తిరుపతి, కర్నాటి పార్వతమ్మ, రవీందర్‌ నాయక్‌, చిలువేరు శ్రీనివాస్‌, దాడి శివ, ఎడ్ల రవికుమార్‌, పోశాల వెంకన్న, సావిత్రి, రవీందర్‌రెడ్డి, నల్లగొండ రమేష్‌, గోరంటల రాజు, కొత్తపల్లి శ్రీనివాస్‌, భాషపాక సదానందం, కూరతోట సదానందం, కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

పోచమ్మమైదాన్‌లో

కాంగ్రెస్‌ శ్రేణుల నిరసన

జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మ దహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement