న్యూశాయంపేట: జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్‌గా బేతి అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికై య్యారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారి జెడ్పీసీఈఓ వసంత సమక్షంలో ఎన్నిక జరిగింది. వైస్ చైర్మన్‌గా శానబోయిన రాజ్‌కుమార్, కోశాధికారిగా బొల్లం శివ, స్టేట్ ఎంసీ మెంబర్‌గా నాడెం శాంతికుమార్‌లతో పాటు సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్‌లుగా కుసుమ సత్యనారాయణ (రిటైర్డ్ తహసీల్దార్), తోట సంపత్‌కుమార్ (రైస్‌మిల్లర్స్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు), మండల పరుశరాములు(ఎన్‌జీఓ), మామిడాల రమేష్‌బాబు (అడ్వకేట్) వద్ది రాజు, చొప్పరి సోమయ్య, ముల్క ప్రసాద్, పుల్లూరి వేణు, డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి, మోతే తిరుపతిరెడ్డి, డాక్టర్ గజ్వెల్లి రాజ్‌కుమార్‌లు ఏకగీవ్రంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాగా ఎన్నికై న కమిటీ సభ్యులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.


