అసలు పోరు వారిద్దరి మధ్యే..! | - | Sakshi
Sakshi News home page

అసలు పోరు వారిద్దరి మధ్యే..!

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

అసలు పోరు వారిద్దరి మధ్యే..!

ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ..

ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌కు టీపీసీసీ మద్దతు..

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

టీజీఎస్‌ ఆర్టీసీ గుర్తింపు యూనియన్‌ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అక్టోబర్‌ 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 26న ఎన్నికల గుర్తులు కేటా యించడంతో ప్రచారంలో మరింత జోష్‌ వ చ్చింది. షెడ్యూల్‌కు ముందే ప్రధాన యూని యన్లు రీజియన్‌ స్థాయిలో సర్వసభ్య సమావేశాలు నిర్వహించి కార్మికులను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి. వరంగల్‌ రీజియన్‌లోని 9 ఆర్టీసీ డిపోలతోపాటు రీజినల్‌మేనేజర్‌ కార్యాలయం, జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. కార్మికశాఖ ఇప్పటికే డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాను విడుదల చేసి ఈనెల 25వరకు అభ్యంతరాల ను స్వీకరించింది. ఓటరు జాబితాను త్వరలోప్రకటించనుంది. మంగళవారం (నేడు) నమూనా బ్యాలెట్‌ను కార్మికశాఖ జారీ చేయనుంది.

12 యూనియన్లు.. రెండు కూటములు..

గుర్తింపు ఎన్నికల బరిలో మొత్తం 12యూనియన్లు ఉన్నాయి. అయితే ప్రధానంగా రెండు కూటముల మధ్యే పోటీ నెలకొంది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ (అశ్వత్థామరెడ్డి వర్గం), స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) ఒక కూటమిగా బరిలో ఉన్నాయి. ఎంప్లాయీస్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ–థామస్‌రెడ్డి వర్గం) మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి. పొత్తుల ప్రకారం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఖమ్మం, నల్లగొండ రీజియన్లలో పోటీ చేస్తుండగా.. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ వరంగల్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర రీజియన్లు, అనుబంధ వర్క్‌షాపులు, రాష్ట్రస్థాయిలో పోటీ చేస్తోంది. మరో కూటమిలో ఎన్‌ఎంయూ వరంగల్‌ రీజియన్‌లో పోటీ చేస్తుండగా.. మిగతా రీజియన్లలో టీఎంయూ బరిలో ఉంది. క్లాస్‌–3 రాష్ట్రస్థాయి పోటీలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ పోటీ చేస్తోంది.

రాష్ట్ర, రీజియన్‌స్థాయి.. రెండు ఓట్లు..

గుర్తింపు ఎన్నికల్లో ప్రతీ కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. క్లాస్‌–3లో రాష్ట్రస్థాయికి, క్లాస్‌–6లో రీజియన్‌ స్థాయికి ఓటు వేయనున్నా రు. దీంతో రాష్ట్రస్థాయి కూటముల ప్రచారంతో పాటు వరంగల్‌ రీజియన్‌లో స్థానిక యూని యన్ల ప్రచారం కూడా జోరందుకుంది.

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో

హోరాహోరీ పోరు

‘విల్లు–బాణం’ ‘కాగడ’ మధ్యే సవాల్‌

బరిలో 12 యూనియన్లు..

రెండు కూటములు..

నేడు నమూనా బ్యాలెట్‌ను జారీ

చేయనున్న కార్మికశాఖ..

వరంగల్‌ రీజియన్‌లో క్లాస్‌–6కు ప్రధాన పోటీ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌, ఎన్‌ఎంయూ మధ్యే కనిపిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ ‘విల్లు–బాణం’ గుర్తుతో, ఎన్‌ఎంయూ ‘కాగడ’ గుర్తుతో బరిలో ఉన్నాయి. దీంతో వరంగల్‌ రీజియన్‌లో ఈ రెండు యూనియన్లు కార్మికులను ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ అనుబంధంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌కు టీపీసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్నికల సమన్వయం కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్‌ను ఇన్‌చార్జిగా నియమించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర యూనియన్లను ప్రోత్సహించకుండా తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌కు సహకరించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement