హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌ ప్రభుత్వం

Sep 6 2026 2:19 AM | Updated on Sep 6 2026 2:19 AM

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

నర్సంపేట: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం నర్సంపేటలో విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా విద్యార్థులు, నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ఆరోపించారు. జాబ్‌ క్యాలెండర్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీసే జీఓ 97ను వెంటనే రద్దు చేసి, విద్యారంగం సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నాడెం శాంతికుమార్‌, బాల్నె వెంకన్న, నాగిశెట్టి ప్రసాద్‌, రాయిడి దుశ్యంత్‌రెడ్డి, శానబోయిన రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement