ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

కాళోజీ సెంటర్‌: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్‌ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జేఏసీ ప్రతినిధుల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ రెండో పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను విడుదల చేయాలని, సుమారు రూ.10 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, సీపీఎస్‌ రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి, ఎన్‌ఈహెచ్‌ఎస్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదకు వినతిపత్రం అందజేశారు. జేఏసీ చైర్మన్‌ గాజే వేణుగోపాల్‌, టీఎన్జీవోస్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు గజ్జెల రాంకిషన్‌, టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్‌, కార్యదర్శి సుజన ప్రసాద్‌, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష,, కార్యదర్శులు మహేందర్‌రెడ్డి, గోవిందరావు, పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి మహేందర్‌రెడ్డి, హెడ్‌మాస్టర్ల సంఘం అధ్యక్షుడు రవీందర్‌, డీటీహెచ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి, టీఎన్జీవోస్‌ జిల్లా కార్యదర్శి పాలకుర్తి సదానందం, కోశాధికారి కిరణ్‌, టీఆర్‌టీఎఫ్‌ అధ్యక్షులు కిషన్‌, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు అశోక్‌, ఎస్‌జీపీటీ సంఘం అధ్యక్షు డు సదానందం, పెన్షనర్ల సంఘం బాధ్యులు సార య్య, బాలరాజు, ధర్మరాజు సోమయ్య, టీజీఓ రాష్ట్ర కార్యదర్శి కోలా రాజేశ్‌, కిరణ్‌గౌడ్‌, టీజీఓ సెక్రటరీ రాజీవ్‌రెడ్డి, సారంగపాణి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సాంబయ్య, భానుప్రకాష్‌, సిటీ అధ్యక్షుడు రాజేశ్‌, ఎస్టీయూ అధ్యక్షుడు మధు లీమియా ఉన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట మహా ధర్నాలో

జేఏసీ ప్రతినిధుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement