ఖిలా వరంగల్: జిల్లాలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,39,997 ఎకరాల్లో గత సంవత్సరం వరి సాగు చేయగా.. ఈఏడాది ఇప్పటి వరకు 64,293 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వివరించారు. వరిసాగు చేయాల్సిన మిగిలిన 75,704 ఎకరాల్లో 33,438 ఎకరాల్లో మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేసినట్లు తెలిపారు. పాకాల సరస్సు ఆయకట్టు కింద వరిసాగు చేయవద్దని రైతులకు సూచించినా కొందరు సాగుచేసినట్లు తెలిపారు. ఎరువులను అక్రమంగా విక్రయించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఫార్మర్ రిజిస్ట్రీని 100 శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్, ఉద్యానశాఖ ఆధికారి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
భూసర్వేను క్షేత్రస్థాయిలో చేపట్టాలి
భూసర్వేను క్షేత్రస్తాయిలో సమగ్రంగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం ఖిలా వరంగల్ మండలం అల్లీపురం గ్రామంలో భూరీసర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీ సర్వే అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.
‘సూపర్ స్పెషాలిటీ’ పనులు పూర్తిచేయాలి
కాశిబుగ్గ: వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను గురువారం ఆమె పరిశీలించారు. భవన నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్ తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్ అశ్విన్, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ ఆనందం, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


