పర్వతగిరి : జీవితాంతం అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించిన ఆ దంపతులు మరణంలోనూ ఒకరి నొ కరు వీడలేదు. 24గంటల వ్యవధిలో ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటన పర్వతగిరి మండలం తురకల సోమవారం గ్రామంలో చోటు చేసుకుంది. సోమారం గ్రామానికి చెందిన గిద్దమారి భారతమ్మ(60) అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమెకు భర్త గిద్దమారి భిక్షపతి(65) సపర్యలు చేశాడు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆమె శుక్రవారం మృతి చెందింది. భార్య మృతి తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన భిక్షపతి శనివారం కన్నుమూశాడు. భారతమ్మ, భిక్షపతి దంపతులు మరణంలోనూ విడిపోలేదని గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. వారి మరణంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
24గంటల వ్యవధిలో
భార్యాభర్తల మృతి
తురుకల సోమారం గ్రామంలో విషాదం


