కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింట | - | Sakshi
Sakshi News home page

కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింట

Aug 23 2026 1:10 AM | Updated on Aug 23 2026 1:10 AM

ఆకట్టుకునే సంస్కృతి.. సంప్రదాయం

తీజ్‌ వేడుకల్లో నిర్వహించే ప్రతీ ఘట్టం ఆకట్టుకుంటుంది. వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. ఎంతో నిష్టతో చేసే ఈ ప్రక్రియను బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలి స్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీన్ని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. ఏడోరోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానీకి నైవేద్యం పెడతారు. ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలు తయారు చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజ చేస్తారు. తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అంద రూ బుట్టలవద్దకు వెళ్తారు. అక్కడికి తండా నాయక్‌ వచ్చి యువతులకు బుట్టలిస్తారు. ఈసందర్భంగా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు.

భోగ్‌ వద్ద తీజ్‌ బుట్టలతో యువతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement