న్యూశాయంపేట: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆజంజాహి మిల్లు మాజీ కార్మికుల సమస్య పరిష్కారానికి కలెక్టరేట్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖ అధికారులు, పిటిషనర్లు, మాజీ కార్మికులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కుడా వైస్ చైర్‌పర్సన్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి, ప్రత్యామ్నాయాలపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు కార్మికులు సమయం కోరినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో మరోసారి సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆజంజాహి మిల్లు మాజీ కార్మికులు పాల్గొన్నారు.
ఫిజికల్ లిటరసీపై వీడియో కాన్ఫరెన్స్
యంగ్ ఇండియా స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కార్యక్రమంలో భాగంగా ఫిజికల్ లిటరసీపై శనివారం హైదరాబాద్ నుంచి స్పోర్ట్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ కిశోర్ గోపినాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ వ్యాయామం, క్రీడలపై అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహద పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు, యువజన క్రీడల అధికారి బి.అఖిల్, డీబీసీడీఓ పుష్పలత, డీఎండబ్ల్యూఓ రమేష్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


