కాకతీయుల వారసత్వ సంపద అద్భుతం | - | Sakshi
Sakshi News home page

కాకతీయుల వారసత్వ సంపద అద్భుతం

Aug 7 2026 12:56 AM | Updated on Aug 7 2026 12:56 AM

గీసుకొండ: కాకతీయుల వారసత్వ సంపద అద్భుతమని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కేకే ఛాత్రత్‌ అన్నారు. మొగిలిచర్లలోని కాకతీయుల కాలం నాటి ఏకవీరాదేవి ఎల్లమ్మ దేవాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని పురావస్తు కళాఖండాలను వీక్షించారు. ఆలయ చరిత్ర గురించి ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆడెపు రమేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో శిల్పాన్ని తన కెమెరాతో ఫొటోలు తీసుకున్నారు. అనంతరం ఛాత్రత్‌ మాట్లాడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇలాంటి అద్భుతమైన దేవాలయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. గ్రామస్తులు అందరూ ఏకమై దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట బిల్లా రమేశ్‌, కుమారస్వామి, చంద్రమౌళి, స్వామి, రంజిత్‌ ఉన్నారు.

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కేకే ఛాత్రత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement