న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026
● మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రం
భీమదేవరపల్లి: సహారా ఇండియాలో డిపాజిట్ చేసిన తమ సొమ్మును వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ భీమదేవరపల్లి మండలానికి చెందిన సహారా కార్యకర్తలు, బాధితులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన ధర్నా గురువారానికి మూడో రోజుకు చేరింది. ‘మా డబ్బులు మాకివ్వాలి’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. డిపాజిట్‌దారులకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను ఢిల్లీలో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎంపీ ఈటల సానుకూలంగా స్పందిస్తూ.. బాధితులకు త్వరలోనే న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ములుకనూరు సహారా మేనేజర్ గడల కుమార్ తెలిపారు. మండలానికి చెందిన మండ మహేందర్, చిత్రాల మహేశ్‌తో పాటు పలువురు బాధితులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


