కాశిబుగ్గ/ఖిలావరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు శంభునిపేట, పడమరకోట, కొత్తవాడ, బ్యాంకు కాలనీలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ లెవల్ అధికారుల పనితీరును పరిశీలించారు. ఓటర్ల నుంచి దరఖాస్తులను నిబంధనల ప్రకారం స్వీకరించాలని, ఓటు హక్కు కలిగిన ప్రతీఒక్కరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీబీసీడీఓ పష్పలత, తహసీల్దార్‌లు శ్రీకాంత్, ఇక్బాల్, అధికారులు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో
ప్రజావాణి
న్యూశాయంపేట: జిల్లా కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ నిర్వహణలో భాగంగా డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతిఒక్కరూ
అప్రమత్తంగా ఉండాలి
పర్వతగిరి: ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. ఈ మేరకు పర్వతగిరి మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో వర్ధన్నపేట నియోజకవర్గంలోని బీఎల్‌ఏలు, ఇన్‌చార్జ్‌లు, ముఖ్య నాయకులతో ఆదివారం సర్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఎల్‌ఏలు పూర్తి సమయాన్ని కేటాయించి ఓటర్ల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో అర్హులైన ఓటరు జాబితాలో చేర్చడం, అనర్హులను తొలగించడం, అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టి కచ్చితమైన ఓటరు జాబితాను రూపొందించేలా కృషి చేయాలన్నారు. అనంతరం ప ర్వతగిరి మండల అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నికై న ఇస్లావత్ సావిత్రికి ఎమ్మెల్యే నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, సర్పంచ్ చీదురు శంకర్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.


