న్యూస్‌రీల్
పాట పాడి నివాళులర్పించి..
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026
చిరుతపులి కలకలం
గూడూరు మండల అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మామునూరు జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులకు చక్కని అవకాశం కల్పిస్తోంది
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదక వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. చల్లగాలులు వీస్తాయి.
ఎస్.జానకి మృతికి జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు జడల శివ ఆధ్వర్యంలో వరంగల్ కళాకారులు నివాళులు అర్పించారు. ఈమేరకు వరంగల్ గోపాలస్వామి గుడి కొత్తవాడ జంక్షన్‌లో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జానకి పాడిన పాటను ఆలపించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనగాం రాము, రమేశ్, శ్రీధరస్వామి, రాంనర్సింహస్వామి, భుజంగరావు, ఇమ్యానియల్ రంగనాఽథ్, చంద్రశేఖర్, సృజన్‌రావు, నజీర్, యాకూబ్, అనిల్, చందన, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
నందీశ్వరుడితో ఎస్.జానకి (ఫైల్)
ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాయని ఎస్.జానకి వాళ్ల మామ మంచి మిత్రులు. 1995లో కాళోజీ వారిని కలవడానికి చైన్నెలోని జానకి నివాసానికి వెళ్లారు. వారితో పాటు నేను వెళ్లాను. ఈ సందర్భంగా ఆమెతో ఫొటో తీసుకున్నాను. జానకమ్మ తనకు లభించిన అవార్డులను, బహుమతులను, షీల్డులను చూపించారు. అలాగే ఆమె భర్త రామప్రసాద్, మామ రామన్, కాళోజీ, కాళోజీ కుమారుడు రవికుమార్ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నాం. అందరితో ఆప్యాయంగా మాట్లాడే జానకమ్మ మృతి బాధను కలిగిస్తోంది.
– మట్టెవాడ అజయ్, మైక్రోఆర్టిస్ట్, గిర్మాజీపేట వరంగల్
గాయని జానకమ్మ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె 2014లో రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వరంగల్‌కు వచ్చారు. దాదాపు గంట పాటు ఆమె రుద్రేశ్వరుడి సన్నిధిలో గడిపారు, ఆలయ పరిక్రమ చుట్టూ తిరుగుతూ శిల్పకళను, నందీశ్వరుడిపై చెక్కిన అలంకరణను పరిశీలించారు.
– గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ
ప్రధానార్చకుడు, హనుమకొండ
హన్మకొండ కల్చరల్: ప్రముఖ సినీ నేపథ్యగాయని, గాన కోకిల ఎస్.జానకి మరణంతో ఓరుగల్లు సంగీతకారులు, ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఓరుగల్లుతో విడదీయలేని అనుబంధం ఉంది. శివభక్తురాలైన జానకి 2014 మార్చి 20న వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ఆమె వరంగల్‌కు రావడం విశేషం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు.
2014లో రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు వరంగల్‌కు వచ్చిన గాయని జానకి
ఆమె మృతితో ఉమ్మడి జిల్లావాసుల దిగ్భ్రాంతి
నివాళులర్పించిన
అభిమానులు


