వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jul 12 2026 12:41 AM | Updated on Jul 12 2026 12:41 AM

సహకారంలో ‘నామినేటెడ్‌’ – 8లోu పాఠశాల దశలోనే విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాల పెంపుపై ఫోకస్‌ 15 నుంచి శాకంబరీ ఉత్సవాలు నిట్‌ను సందర్శించిన తైవాన్‌ ప్రొఫెసర్ల బృందం కొనసాగుతున్న టీజీసీపీగెట్‌

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026

ఉమ్మడి

జిల్లాలో

ఇలా..

● అన్నాఅక్క మెంటార్‌షిప్‌ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఈనెల 1న ప్రారంభం కాగా, సెప్టెంబర్‌ వరకు కొనసాగనుంది.

● ఈ మెంటార్‌షిప్‌ వారానికి రెండు మూడు రోజుల పాటు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకా రం 30 గంటల మేర బోధించనున్నారు.

● ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నా యి. అందులో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐదో సెమి స్టర్‌ చదువుతున్న విద్యార్థులకు అన్నాఅక్క మెంటార్‌షిప్‌ టీచింగ్‌ లెర్నింగ్‌ ఇంటర్నెషిప్‌నకు అవకాశం కల్పించారు.

వాతావరణం

జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం సాధారణంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌లకు అన్‌ అఫిషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌లను ప్రభుత్వం నియమిస్తోంది. ఇప్పటికే వరంగల్‌ జిల్లాలోని 13 పీఏసీఎస్‌లకు నియమించింది.

సాంకేతిక విద్యనందించాలని..

ప్రభుత్వ యూపీఎస్‌, హైస్కూల్‌ విద్యార్థులకు సాంకేతక విద్యను అందించాలని ‘అన్నాఅక్క మెంటార్‌షిప్‌, టీచింగ్‌ ఇంటర్న్‌షిప్‌’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఐదో సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజిటల్‌ లెర్నింగ్‌, కంప్యూటింగ్‌, కోడింగ్‌, ఫైథాన్‌, జావా, గేమ్‌ డిజైన్‌ వంటి అనేక అంశాలపై బోధిస్తున్నారు.

సర్‌ ప్రక్రియ పరిశీలన

రాయపర్తి: మండలంలో జరుగుతున్న సర్‌ ప్రక్రియను ఓటరు ఎన్యూమరేషన్‌ అబ్జర్వర్‌, భూమి కొలతల ఏడీ ఎం.శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని రాయపర్తి, మైలారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు సర్‌ ప్రక్రియను పరిశీలించినట్లు తెలిపారు. బీఎల్‌ఓలకు పలు సూచనలిచ్చారు. త్వరగా ఎన్యూమరేషన్‌ ఫారాలను ఓటర్ల నుంచి సేకరించాలని శ్రీనివాసులు సూచించారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ చంద్రమోహన్‌ పాల్గొన్నారు.

18 వరకు జనాభాపై అవగాహన కార్యక్రమాలు

గీసుకొండ: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 11 నుంచి 18వ తేదీ వరకు జనాభా నియంత్రణపై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఎ డాక్టర్‌ ఐ.ప్రకాశ్‌ తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ కీర్తినగర్‌ కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జనాభా నియత్రణపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ‘పిల్లలకు సరైన అంతరం ఉంటే.. కుటుంబాలు ఆరోగ్యంగా, నైపుణ్యంతో ఉంటాయి’ అనే థీమ్‌తో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సయ్యద్‌ ఇక్తదార్‌ అహ్మద్‌ మాట్లాడుతూ దంపతులు తాత్కాలిక జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలన్నారు. వెద్యాధికారి డాక్టర్‌ హుస్సేన్‌, స్టాటిస్టికల్‌ అధికారి ప్రసన్న, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, సీఓ విఠల్‌, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

హన్మకొండ కల్చరల్‌: శాకంబరీ నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవాలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరీ ఉత్సవాల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మాట్లాడుతూ.. ఈ నెల 15నుంచి జూలై 29 వరకు 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. రోజూ అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలతో పాటు జూలై 29న మహా శాకంబరీగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, సిబ్బంది కూచన హరినాఽథ్‌, అలుగు కృష్ణ, చింత శ్యామ్‌సుందర్‌ పాల్గొన్నారు.

15 రోజుల్లో అఫిలియేషన్స్‌ అందించాలి

వరంగల్‌ స్పోర్ట్స్‌: నేటి నుంచి 15 రోజుల్లోపల జిల్లాలోని అన్ని క్రీడా సంఘాలు అఫిలియేషన్స్‌ అందించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజీజ్‌ఖాన్‌ తెలిపారు. హనుమకొండలోని జిల్లా గ్రంథాలయంలో ఒలింపిక్స్‌ సంఘం జనరల్‌ బాడీ సమావేశం శనివారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కైలాస్‌ యాదవ్‌ క్రీడా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సైక్లింగ్‌, కిక్‌బాక్సింగ్‌, నెట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌లో ఏకగ్రీవ ఎన్నికలు చెల్లవని, హైదరాబాద్‌ స్టేట్‌ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాల మేరకు అతడిని తొలగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో జిల్లా, మండల ఎన్నికలు ఎన్నికలు ఎవరు నిర్వహించినా బైలా ప్రకారం నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం జాయింట్‌ సెక్రటరీ కృష్ణారెడ్డిని ఇన్‌చార్జ్‌ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, కోశాధికారి టి.శ్యాం ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, సారంగపాణి, సారయ్య, అశోక్‌, అసోసియేట్‌ వైఎస్‌ ప్రెసిడెంట్లు నలబోల సతీశ్‌, శ్యామల, పవన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

మెంటార్లుగా డిగ్రీ విద్యార్థులు.. వీరికి ప్రత్యేక శిక్షణ

అభ్యాసకులు ప్రభుత్వ యూపీఎస్‌, హైస్కూళ్ల పిల్లలు

కృత్రిమ మేథ, డిజిటల్‌ లెర్నింగ్‌,

కోడింగ్‌ అంశాలపై అవగాహన

పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం

పెంపొందించేలా చర్యలు

స్నేహపూర్వక వాతావరణం..

చాలామంది విద్యార్థులు భయం, బెరుకు, స్పీకింగ్‌ ఫియర్‌ వల్ల క్లాస్‌రూమ్‌లో టీచర్‌ను సందేహాలు అడగకుండానే ఉండిపోతారు. అన్నాఅక్క మెంటార్‌షిప్‌లో భాగంగా విద్యార్థులకు, మెంటార్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. భయంలేకుండా సందేహాలు అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్‌ మొత్తం ఏఐదే కాబట్టి బేసిక్‌ లెవెల్‌ నాలెడ్జ్‌ ఇంప్రూవ్‌ అవుతుందని అంచనా.

డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్‌

డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా తెలంగాణ కోడ్‌మిత్ర పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. సర్టిఫికెట్‌ పొందారు. వీరికి శిక్షణ ఇచ్చారు. బోధన వల్ల వీరికి కమ్యూనికేషన్‌, టీచింగ్‌ స్కిల్స్‌ ఇంప్రూవ్‌తోపాటు మెంటార్‌షిప్‌ 30 గంటల పూర్తి చేసిన విద్యార్థులకు ఐదో సెమిస్టర్‌ ఫలితాల్లో ఒకటి లేదా రెండు క్రెడిట్‌ పాయింట్స్‌ కేటాయిస్తారు. ఇది వారికి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్నారు.

ఇదొక అద్భుత అవకాశం

నేను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను డిగ్రీ చదువుతూ ఇలా హైస్కూల్‌ విద్యార్థులకు బోధించే అవకాశం రావడం అద్భుత అవకాశంగా భావిస్తున్నా. నాలో బోధన నైపుణ్యాలు పెంచుకునే అవకాశం కలిగింది. – బి.భార్గవి, బీసీఏ, ఫైనల్‌ ఇయర్‌, కేడీసీ హనుమకొండ

డిజిటల్‌

లెర్నింగ్‌

పుస్తకం

చదువుతున్న

విద్యార్థులు

సాంకేతిక అంశాలు

నేర్చుకుంటున్నాం..

అన్నాఅక్క మెంటార్‌షిప్‌లో భాగంగా ఏఐ, డిజిటల్‌ లెర్నింగ్‌, కోడింగ్‌ ఫైథాన్‌, జావా వంటి పలు అంశాలు చెబుతున్నారు. డిజిటల్‌ లెర్నింగ్‌కు సంబంధించిన పుస్తకాలు కూడా ఇచ్చారు. వీడియోలను ప్రదర్శిస్తూ బోధిస్తుండడంతో మాకు ఈజీగా అర్థమవుతోంది.

– ఎస్‌ ధనలక్ష్మి, తొమ్మిదో తరగతి, మర్కజీ హైస్కూల్‌, హనుమకొండ

నేర్చుకుంటూ బోధిస్తున్నా..

ఏఐ, డిజిటల్‌ లెర్నింగ్‌ తదితర అంశాలను నేను నేర్చుకుంటూ పైడిపెల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నా. ఐపీఎఫ్‌ బోర్డు ద్వారా ఆయా సాంకేతిక అంశాలను వీడియోలో రూపంలో బోధిస్తుంటే విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు.

– ఎస్‌.రాజ్‌కుమార్‌, బీఏ,

కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండ

డిగ్రీ కళాశాల వారీగా ఎంపికైన

మెంటార్లు, స్కూళ్లు ఇలా..

మెంటార్లు స్కూళ్లు

భవిష్యత్‌లో ఎంతో

ఉపయోగం..

హనుమకొండ

పరకాల

ప్రభుత్వ

మహబూబాబాద్‌

ప్రభుత్వ

జనగామ ఏబీవీ

పింగిళి

మహిళా

నర్సంపేట ప్రభుత్వ

కాకతీయ

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ను శనివారం నేషనల్‌ తైవాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ చెంగ్‌ చూన్‌ హీ తన బృందంతో సందర్శించారు. నిట్‌ వరంగల్‌ అధ్యాపకులతో కార్బన్‌ డై ఆకై ్సడ్‌ వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన స్వచ్ఛ ఇందనంగా మార్చే నూతన సాంకేతికతలపై, పరిశ్రమల నుంచి వెలువడే కార్డన్‌ను తగ్గించడంపై పరిశోధనల గురించి చర్చించారు. ఈసందర్భంగా నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ తైవాన్‌ ప్రొఫెసర్ల బృందానికి కాకతీయ తోరణ జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ లీలా మనోహర్‌ ఏశాల, రాజేశ్‌ఖన్నా గడ్డం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను తెలంగాణ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ ప్రవేశ పరీక్షలు శనివారం నాలుగో రోజు కొనసాగాయని కన్వీనర్‌ ప్రొపెసర్‌ కె.రాజేందర్‌ తెలిపారు. ఉదయం సెషన్‌లో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ కోర్సుకు 2,681 మంది అభ్యర్థులకుగాను 2,323 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం సెషన్‌లో ఎంఎల్‌ఐఎస్సీ/బీఎల్‌ఐఎస్సీ కోర్సుకుగాను 736 మందికి 600 మంది హాజరయ్యారు. సాయంత్రం సెషన్‌లో నిర్వహించిన జియోగ్రఫీ ప్రవేశపరీక్షకు 165 మందికి 145 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement