వదలం.. కదలం! | - | Sakshi
Sakshi News home page

వదలం.. కదలం!

Jul 12 2026 12:41 AM | Updated on Jul 12 2026 12:41 AM

రెవెన్యూ విభాగంలో అదే పరిస్థితి

కొత్త ఇంటి నంబరు ఇచ్చే ముందు, పేరు మార్పిడిలు చేసినా ఏదైనా తమకు సొమ్ము చెల్లించాల్సిందేనంటున్నారు. తమ డివిజన్‌లో ఏ పనైనా తాము చెప్పినట్లు ముందుకు సాగాల్సిందేనని, తమకు మాత్రం కాసులు సమర్పించుకోవాల్సిందేనని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను శాసిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇలా అన్ని విభాగాల్లో పెత్తనం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

వరంగల్‌ అర్బన్‌ :

అండర్‌ రైల్వే గేట్‌కు చెందిన ఓ తాజా మాజీ కార్పొరేటర్‌ది ప్రతిపక్షం. పదవిలో ఉన్నంతకాలం ఆయనకు ఎదురేలేదు. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా వ్యవహరించారు. అనుకున్న పనులన్నీ చేయించుకున్నాడు. అయితే పదవి కోల్పోయినా అదే జబర్దస్తీగా వ్యవహరిస్తున్నాడు.

వరంగల్‌లో గత పాలక వర్గంలో ఓ పార్టీ నాయకుడి సతీమణి కార్పొరేటర్‌గా గెలిచారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వారూ కండువా మార్చేశారు. పదవిలో ఉన్నంత కాలం అందరిది ఒక ఎత్తయితే ఆయనది మరో ఎత్తు. వివిధ మార్గాల్లో పదవిని బాగా వినియోగించుకున్నాడు. దిగిపోయే ముందు భవన నిర్మాణదారుల వద్ద నుంచి పెద్దఎత్తున కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు.

హనుమకొండలో ఓ పార్టీ నాయకుడి సతీమణి కార్పొరేటర్‌గా గెలుపొందారు. నాణేనికి ఒక వైపు, మరో వైపు తనకు అనూకూలంగా ఉండే వర్గాలను కూడగట్టుకొని పదవిని బాగా వినియోగించుకుని అన్నీ విభాగాలను శాసించారు. ఇప్పుడూ అదేతీరు.

.... ఇలా 70 శాతం పైగా తాజా మాజీ కార్పొరేటర్లు పదవీ కాలం ముగిసినా హల్‌చల్‌ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వరంగల్‌ను

వదలడం లేదు

మాజీలైన కొందరు తాజా కార్పొరేటర్లు గ్రేటర్‌ వరంగల్‌ను వదలడం లేదు. ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన వారు పదవి కాలం పూర్తయిన ఆ ‘ధన’ దాహం తీరడం లేదన్న విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కొత్త పాలక వర్గం వచ్చే వరకు తామే కార్పొరేటర్ల మంటూ హల్‌చల్‌ చేస్తున్నారని,. అన్నీ కార్యకలాపాలు తమ కనుసన్నల్లోనే కొనసాగాలని ఆయా విభాగాల అధికారులు, సిబ్బందిపై కర్రపెత్తనం చెలాయిస్తున్నట్లు బల్దియా వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే కార్పొరేటర్లుగా గెలుస్తామని, మా మాట ఇప్పుడు వినకపోతే పదవి దక్కిన తర్వాత మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుండటం చర్చనీయాశంగా మారింది. దీంతో జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బంది నలిగిపోతున్నారు.

నాలుగు శాతం పర్సంటేజీ ఇవ్వాల్సిందే

ఇంజినీరింగ్‌ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతీ పనిలో తమకు 4 శాతం పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని నిబంధన పెడుతున్నారు. లేనిపక్షంలో పనులు నిలిపివేయాలని హెచ్చరిస్తున్నారు. పెండింగ్‌, కొత్త పనులకు లెక్క కట్టి కమీషన్లు ఇవ్వాల్సిందేనని కాంట్రాక్టర్లకు కండీషన్‌ పెడుతున్నారు. వినకపోతో ఇంజినీర్లపై ఒత్తిడి పెంచి సొమ్ము వసూలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భవన నిర్మాణాలపై రూ.లక్షల్లో వసూళ్లు

అక్రమ భవనమైతే తాజా మాజీలైన అనుచరులు వాలిపోయి కార్పొరేటర్‌కు సొమ్ము చెల్లిస్తేనే నిర్మాణం ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఒకవేళ నిర్మాణ అనుమతి ఉంటే కూడా ఎంతో కొంత మట్టు చెప్పాలని కోరుతున్నారు. వినకపోతే క్షేత్ర స్థాయి లైన్‌మన్లు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లను టార్చర్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏదైనా భవన నిర్మాణం చేపడితే గద్దల్లా వాలిపోయి రూ. వేలు, రూ.లక్షలో డిమాండ్‌ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బల్దియాలో తాజా మాజీ కార్పొరేటర్ల జబర్దస్తీ

మళ్లీ తామే అంటూ అధికారులు,

సిబ్బందిపై కర్రపెత్తనం

నలిగిపోతున్న జీడబ్ల్యూఎంసీ

అధికారులు, సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement