గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

Jul 12 2026 12:41 AM | Updated on Jul 12 2026 12:41 AM

గీసుకొండ: గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్పంచ్‌లు పాటుపడుతూ ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సూచించారు. జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిలో గీసుకొండ, సంగెం మండలాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి, ప్రణాళికపై శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గంగదేవిపల్లి మాజీ సర్పంచ్‌ దివంగత కూసం రాజమౌళిని ఆదర్శంగా తీసుకుని అంకితభావంతో పనిచేయాలన్నారు. కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ శ్రీసర్‌శ్రీ ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫారాన్ని నింపి అందించాలని చెప్పారు. వరిలో తక్కువ కాలం, తక్కువ నీటితో పండే రకాలను రైతులు ఎంచుకుని సాగు చేయాలని పేర్కొన్నారు. భూగర్భ జలాలను పరిరక్షించుకునే చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఆర్‌డీఓ నాగపద్మజ, ఆర్‌డీఓ సుమ, డీఎల్పీఓ వేదవతి, తహసీల్దార్‌ రియాజుద్దీన్‌, ఎంపీడీఓ కృష్ణవేణి, ఇన్‌చార్జ్‌ ఎంపీఓ శేషు పాలొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే, అధికారులు జలసిరి ప్రతిజ్ఞ చేయించారు.

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

గంగదేవిపల్లిలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement