● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నెక్కొండ: మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపలు చేశారు. రూ.10 లక్షల చొప్పున నెక్కొండ, వెంకటాపురం, మడిపెల్లి, గొట్లకొండ, సాయిరెడ్డిపల్లిల్లో వీఓ భవనాలు, గుండ్రపల్లి, తోపనపల్లిలో ఒక్కోదానికి రూ.10 లక్షల ఖర్చుతో జీపీ భవనాలు, అలంకానిపేటలో రూ.5 లక్షలతో యూత్ క్లబ్ భవన నిర్మాణానికి సంబంధించిన శిలా ఫలకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దొంతి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి సర్కార్ ముందుకు సాగుతోందని వివరించారు. సమావేశంలో టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు చల్లా శ్రీపాల్‌రెడ్డి, మాదాటి శ్రీనివాస్, ఆవుల శ్రీనివాస్, ఎంపీడీఓ లావణ్య, ఏపీఎం కిరణ్‌కుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్, మండల పార్లీ అధ్యక్షుడు లావుడ్య తిరుమల్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.


