కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య వర్ధంతి | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య వర్ధంతి

Jul 5 2026 2:06 AM | Updated on Jul 5 2026 2:06 AM

న్యూశాయంపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీబీసీడీఓ పుష్పలత, జిల్లా అధికారులు, మాజీ కార్పొరేటర్‌ మరుపల్లి రవి పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలి

న్యూశాయంపేట: ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచేలా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో 2026–27 సంవత్సరానికి 85 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంటసాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు వెల్లడించారు. పంటమార్పిడి పద్ధతులు పాటిస్తూ, కూరగాయల సాగు ప్రోత్సహించాలన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఏఓ విజయనిర్మల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement