న్యూశాయంపేట/ఖిలా వరంగల్: ‘సర్’ ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేయాలని అదనపు ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాకు శనివారం వచ్చిన ఆయనకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద మొక్క అందజేసి స్వాగతం పలికారు. కలెక్టర్‌తో కలిసి సర్ అమలు తీరుపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజవర్గంలోని ఖిలా వరంగల్ మండలంలో ఆర్డీఓ సుమ, ఏఓ ఫణికుమార్, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్‌తో కలిసి శనివారం ఆయన సర్ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటి సర్వే, ఓటరు వివరాల ఽధ్రువీకరణ, ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులు తప్పనిసరిగా ఓటరు జాబితాలో ఉండేలా చూడా లని, ఎన్నికల సంఘం నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.


