పత్తి ఉత్పాదకత పెంపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పత్తి ఉత్పాదకత పెంపే లక్ష్యం

Jul 5 2026 2:06 AM | Updated on Jul 5 2026 2:06 AM

రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ

పక్కాగా ‘కపాస్‌ కాంతి మిషన్‌’ అమలు

1300 హెక్టార్లలో క్లోజర్‌ స్పేసింగ్‌

ప్రదర్శన క్షేత్రాలు

ఖిలా వరంగల్‌: పత్తి సాగులో ఉత్పాదకత పెంచి రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్‌ కపాస్‌ కాంతి మిషన్‌ పథకం ప్రవేశ పెట్టింది. 2026–27 నుంచి 2030–31 వరకు ఈ పథకం అమలు చేయనుంది. ఈ పథకంలో భాగంగా ఎంపికై న రైతులకు ఉచితంగా నాణ్యమైన పత్తి విత్తనాలు అందించి, ఆధునిక సాగు విధానాలను ప్రోత్సహించనున్నారు. పత్తి ఉత్పాదకతను హెక్టారుకు 755 కిలోల లింట్‌ వరకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తక్కువ దూరంలో పత్తి సాగు..

తక్కువ దూరంలో పత్తిని విత్తే ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయనున్నారు. (క్లోసర్‌ స్పేసింగ్‌) విధానంతో 1,300 హెక్టార్లలో ఎంపిక చేసిన 3,250 ఎకరాల్లో సాగుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు రూ.182 కోట్ల నిధులు కేటాయించారు. ఈ ప్రదర్శన క్షేత్రాల్లో పాల్గొనే రైతులకు ఉచితంగా విత్తనాలు అందించి శాసీ్త్రయ పద్ధతిలో సాగు చేయించనున్నారు. దీంతో ఎకరాకు మొక్కల సంఖ్య పెరిగి దిగుబడి అధికమవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల పేర్కొన్నారు.

500 ఎకరాల్లో సమగ్ర పంట యాజమాన్యం

జిల్లాలోని 13 మండలాల్లో 200 హెక్టార్లలో సమగ్ర పంట యాజమాన్యం (ఇంటిగ్రేటెడ్‌ క్రాప్‌ మేనేజ్‌మెంట్‌) కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు రూ.15లక్షల నిదులు ప్రభుత్వం కేటాయించింది. ఈ పద్ధతిలో ఎరువుల సమతుల్య వినియోగం, పురుగుల సమగ్ర నివారణ, నీటి నిర్వహణ, పంట సంరక్షణ వంటి అంశాలపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈమిషన్‌లో విత్తనాల పంపిణీతోపాటు రైతులకు శాసీ్త్రయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు.

సద్వినియోగం చేసుకోండి : డీఏఓ

ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న నాణ్యమైన విత్తనాలను రైతులంతా సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి విజయ నిర్మల సూచించారు. పలు మండలాల్లో పత్తి విత్తనాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement