హన్మకొండ అర్బన్: జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి బాలసముద్రం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం బీఎల్‌ఓలతో సమీక్షించారు. అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి
కాజీపేట అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అడిషనల్ సీఈఓ డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. కాజీపేట మండలం న్యూశాయంపేటలో శనివారం సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అడిషనల్ సీఈఓ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు సీహెచ్.రాజు, రవీందర్‌రెడ్డి, అదనపు తహసీల్దార్ రమేశ్, ఆర్‌ఐ శివ, డీసీసీ కార్యవర్గ సభ్యుడు మామిండ్ల సురేశ్, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.


