నేడు కన్నెపల్లికి కేటీఆర్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు కన్నెపల్లికి కేటీఆర్‌

Jul 5 2026 2:06 AM | Updated on Jul 5 2026 2:06 AM

నేడు కన్నెపల్లికి కేటీఆర్‌

కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీపంప్‌హౌస్‌(కన్నెపల్లి)ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు (ఆదివారం) సందర్శించనున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్‌ నుంచి కారులో బయలుదేరుతారు. వరంగల్‌, పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేరుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు తెలిపారు. ఆయనవెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు రానున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, మేడిగడ్డ బరాజ్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటిని నిలిపి పంపులు ద్వారా ఎత్తిపోయాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్‌ బృందంతో కలిసి కేటీఆర్‌ టూర్‌ ప్లాన్‌ చేసినట్లు చేశారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కాగా, శనివారం కన్నెపల్లి పంపుహౌస్‌, పరిసరాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించి కేటీఆర్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఆయనతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు

లక్ష్మీపంప్‌హౌస్‌ పంపులు లిఫ్ట్‌

చేయాలనే లక్ష్యంతో పర్యటన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement