న్యూస్‌రీల్
శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2026
7
స్నేహితులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే.. అతను మాత్రం పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వెళ్లాడు. చిన్నప్పటి నుంచి తాను ప్రత్యక్షంగా అనుభవించిన పేదరికాన్ని జయించాలనుకున్నాడు. హైదరాబాద్ వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. అనుభవాన్ని మూటగట్టుకుని సొంతంగా రైస్ షాపు ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు కొనుక్కున్నాడు. పేదరికాన్ని తరిమేశాననుకుంటున్న తరుణంలో స్నేహం రూపంలో మోసం ఎదురైంది. చివరికి ఆ స్నేహ బంధం ప్రాణాలనే హరించింది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు చిన్నారులు దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్నారు.
– చెన్నారావుపేట
భరించలేక మనస్తాపంతో దంపతుల బలవన్మరణం
వ్యాపారం కోసం రూ.15 లక్షలు తీసుకొని మోసం
అనాథలైన వారి ఇద్దరు కుమారులు
చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం


