సాక్షి, వరంగల్: జిల్లా పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,76,953 మంది ఓటర్లకు సంబంధించి ప్రక్రియ చేపట్టగా.. ఇప్పటివరకు 92.88 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. 795 మంది బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ఓటర్ల నుంచి తిరిగి వచ్చిన ఫారాలను డిజిటలైజేషన్ చేసి పరిశీలించే ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. ఈసీ నిర్దేశించిన గడువులోపు ప్రతి ఓటరును చేరుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.
తదుపరి దశపై అధికారుల దృష్టి..
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో దరఖాస్తుల పంపిణీ దాదాపు పూర్తి అయ్యింది. ప్రస్తుతం అధికారులు తిరిగి వచ్చిన ఫారాల ధ్రువీకరణ, కుటుంబ సభ్యుల మ్యాపింగ్, స్వీయ మ్యాపింగ్, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తున్నారు. అర్హులైన ప్రతిఓటరు పేరు తుది జాబితాలో ఉండేలా ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేస్తున్నారు.
జిల్లాలో 7.76 లక్షల మందికి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ
ఇప్పటివరకు 8,254 దరఖాస్తులు ఓటర్ల నుంచి స్వీకరణ
క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరుగుతున్న 795 మంది బీఎల్‌ఓలు
నియోజకవర్గాల వారీగా పురోగతి ఇలా..
నియోజకవర్గం ఓటర్లు ఫారాల డిజిటలైజేషన్ అందిన బీఎల్‌ఓ
పంపిణీ ఫారాలు పరిశీలన
నర్సంపేట 2,40,244 2,30,167 2,34,682 5,249 2,978
వరంగల్ తూర్పు 2,60,437 2,36,481 2,58,379 677 364
వర్ధన్నపేట 2,76,272 2,54,978 2,73,287 2,328 1,159
మొత్తం 7,76,953 7,21,626 7,66,348 8,254 4,501


