పరకాల: త్వరలో మార్కెట్‌లోకి పరకాల ఇందిరా మహిళా డెయిరీ పాల ఉత్పత్తులు రానున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎన్‌డీడీబీ అధికారులతో పాటు డీఆర్డీఏ అధికారులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పరకాల ఇందిరా మహిళా డెయిరీ ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి చేపట్టనున్న ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు. కార్యక్రమంలో ఎన్‌డీడీబీ, సెర్ప్ అధికారులు, సంబంధిత అధికారులతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన
పరకాల పట్టణ శివారులోని పెద్ద రాజీపేట వద్ద జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి గురించి తెలుసుకున్న ఆయన పనులను నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు వల్ల స్థానిక విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఇందిరా మహిళా డెయిరీకీ
ఎన్‌డీడీబీ మద్దతు
అధికారులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి సమీక్ష


