వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jul 3 2026 1:58 AM | Updated on Jul 3 2026 1:58 AM

శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026
ఈవీ బస్సు.. భద్రత తుస్సు

హన్మకొండ: విద్యుత్‌ బస్సులపై భ్రమలు వీడుతున్నాయి. తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు విద్యుత్‌ బస్సులను మొదటినుంచీ వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ఈవీ బస్సులను ప్రవేశపెట్టింది. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆలోచనలో పడింది. ప్రయాణికుల భద్రతకు భరోసా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ బస్సులను నిలిపేసింది. ఇటీవల కరీంనగర్‌లో 15 రోజుల వ్యవధిలో రెండు బస్సుల్లో మంటలు లేచి దగ్ధమయ్యాయి. వరంగల్‌ రీజియన్‌లో వరంగల్‌–2 డిపోనకు 115 బస్సులు కేటాయించగా.. ఈ డిపో ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతోంది. వీటన్నింటి సేవలను నిలిపేసింది.

స్పందించని జేబీఎం యాజమాన్యం

వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతున్న జేబీఎం సంస్థకు ప్రయాణికుల భద్రతపై లేఖ రాసినట్లు సమాచారం. ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని, తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అడిగినట్లు తెలిసింది. ఈ లేఖకు జేబీఎం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా ఎలక్ట్రిక్‌ బస్సులు నిలిపేసింది. ఈక్రమంలో వరంగల్‌ రీజియన్‌లో 115 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement