పోలీస్‌ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి

Jul 3 2026 1:58 AM | Updated on Jul 3 2026 1:58 AM

పోలీస్‌ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి

హన్మకొండ: పోలీసు శాఖలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని అంబేడ్కర్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (ఏబీఎస్‌ఎఫ్‌) ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏబీఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు హనుమకొండలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ కూడలి నుంచి అంబేద్కర్‌ కూడలి వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. కూడలిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మంద నరేష్‌ మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో 5 వేల ఉద్యోగాలకు కాకుండా 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని సూచించారు. కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 36 ఏళ్లు, ఎస్సైకి 38 సంవత్సరాల వయోపరిమితి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏబీఎస్‌ఎఫ్‌ నాయకులు భరత్‌, రణధీర్‌, వేణు, సూర్య, పవన్‌, శ్రీనివాస్‌, ప్రణయ్‌, పవన్‌, కార్తీక్‌, వేణు, సాయి కిరణ్‌, వెంకటేష్‌, భిక్షపతి, నవ్య, ప్రసన్న, కళ్యాణి, భాగ్య, హిమబిందు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement